Sunday, December 27, 2009

ఒక మంచి పాట

మధుమాస వేళలో ...మరు మల్లె తోటలో
మనసైన చిన్నదీ .... లేదేలనో....... (మధు)

చ 1) ఆడింది పూల కొమ్మ.... పాడింది కోయిలమ్మ
అనురాగ మందిరంలో కాన రాదు పైడి బొమ్మ
ప్రణయాలు పొంగే వేళ
నాలో రగిలే ఏదో జ్వాల (మధు)

చ ౨) ఉదయించే భాను బింబం వికసించలేదు కమలం
నెల రాజు రాక కోసం వేచింది కన్నె కుముదం
వలచింది వేదనకేనా
జీవితమంతా దూరాలెనా (మధు)

వివరాలు తెలియవ్ కాని, ఒక మంచి పాట అని మాత్రం ఎంజాయ్ చేయచ్చు .
ఫ్రెండ్స్, ఎంజాయ్

1 comments:

  1. చిత్రం: అందమే ఆనందం (1977) రంగనాథ్, జయప్రద
    సంగీతం: సత్యం
    రచన: వేటూరి
    గానం: S P బాలసుబ్రమణ్యం

    ReplyDelete